Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మెన్ నరేంద్రబాబు
హైదరాబాద్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మార్పులు చేయాలని శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మెన్ వి.నరేంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని వరంగల్‌లోని కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ''వేరు వేరు సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ జరుగుతోంది. దాంతో కొన్ని ఎ-కేటగిరి సీట్లు బ్లాక్ అవుతున్నాయి. ప్రతి దశ కౌన్సెలింగ్‌లో ఇదే పద్ధతి పునరావృతం అవుతోంది. చివరికి అవి మేనేజ్మేంట్ కోటాకు బదిలీ అవుతున్నాయి. దీనిని నివారించాలంటే ఇరు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు చర్చించి, మెడికల్ కౌన్సెలింగ్ సమిష్టిగా నిర్వహించాలి'' అని వినతిపత్రంలో నరేంద్రబాబు కోరారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ స్పందిస్తూ, విద్యార్థులకు న్యాయం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.