Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగబద్ధంగా గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతానికి రిజర్వేషన్లను కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతూ, గిరిజనులను మోసం చేస్తున్నాయని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్ ,ఆర్. శ్రీరామ్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ పెంచుకోవటానికి రాష్ట్రాలకు అధికారం లేదనే సుప్రీంకోర్టు తీర్పు ఉనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటంలో విఫలమైందని విమర్శించారు. గత ఎనిమిదేండ్లుగా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా గిరిజనులు విద్య ,ఉద్యోగ ,రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలు, ప్రత్యుత్తరాల కాపీలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకాలం గిరిజనులను మోసం చేసిన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అన్ని గిరిజన సంఘాలను కలుపుకుని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.