Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న బోధన సిబ్బంది వేతనాలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుందనీ, ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గెస్ట్ టీచర్‌కు గతంలో గంటకు రూ.140 చెల్లించగా, పెరిగిన వేతనం ప్రకారం గంటకు రూ.240 చెల్లిస్తారని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్లకు గతంలో గంటకు రూ.180 ఉండగా రూ. 270కి పెంచినట్టు తెలిపారు. బోధన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా పెంచామని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 2022- 23 విద్యాసంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామనీ, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.