Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఎ.రాజేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా పరీక్షలు, చికిత్సలను వేగవంతం చేసినట్టు తెలంగాణ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ. రాజేశం వెల్లడించారు. ఈ నెల 24న అంతర్జాతీయ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లో పీఐబీ ఆధ్వర్యంలో టీబీ రోగుల సంరక్షణ, నిర్మూలనపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఐబీ డైరెక్టర్ శృతిపాటిల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు, స్వచ్ఛంధ సంస్థలు, మీడియా, టీబీ నుంచి కోలుకున్న వారిని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటులో ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలతోపాటు వైద్యం కూడా అందిస్తున్నట్లు డాక్టర్ రాజేశం తెలిపారు. జాతీయ స్థాయిలో టిబి నిర్మూలనలో ముందున్న నిజామాబాద్ జిల్లా అధికారులకు ఈ నెల 24న న్యూఢిల్లీలో జరుగనున్న ప్రపంచ టీబీ దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సిల్వర్ మెడల్ అందజేయనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు కాంస్య పతకానికి ఎంపికయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఇసీ ఆఫీసర్ జితేంద్ర, తెలంగాణ టీబీ కేంద్రం సాంక్రమిక వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సి.సుమలత పాల్గొన్నారు.