Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయి. మంగళవారం అమెరికాలో ఆయా కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఫిస్కర్, హైదరాబాద్‌లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్ ఫిష్కర్, సియఫ్వో గీతా ఫిస్కర్‌లతో కేటీఆర్ చర్చించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందనీ, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో జరిగిన మరో సమావేశంలో గోల్ఫ్ కంపెనీ ప్రతినిధులు డిజిటేక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కంపెనీ రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న 8,700 మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. మంత్రితో కాల్ వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సిఎఫ్వో బ్రయన్ లించ్, సీఐవో సాయి కూరపాటిలతో సమావేశమయ్యారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.