Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే, వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా? అనే అనుమానం వస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలంటూ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని కేంద్రాన్ని కోరారు. పంజాబ్లో 100 శాతం వడ్లను కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై 'ఒకే దేశం- ఒకే సేకరణ' ఉండాలని ఆమె కోరారు.