Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపుజాతా ప్రారంభోత్సవంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు నిచ్చారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్వర్యంలో మంగళవారం తుర్కయంజాల్ అంబే ద్కర్ చౌరస్తాలో సమ్మె ప్రచార జీపుజాతాను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్ అధ్యక్షతన జరిగిన సభలో పాలడుగు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయ కత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన కొనసాగిస్తోంద న్నారు. జాతీయత, దేశభక్తి గురించి చెబుతూ ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలు అమలు చేస్తోందన్నారు. జాతీయ సంపదను, సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్ ఇండియా వంటి వాటిని కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్లుగా కరోనా సంక్షోభంతో కార్మికులు, సామాన్య ప్రజల బతుకులు అతలాకుతలమైనా వారిని ఆదుకోకపోగా కనీస మానవత్వం లేకుండా నిత్యావసర సరుకులతోపాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని చెప్పారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.21 వేలు అమలు చేసి, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు డి.జగదీష్, జిల్లా నాయకులు ఇ.నర్సింహా, కె.శ్రీరామ్మూర్తి, బుగ్గరాములు, ఎల్లేశ్, యాదగిరి, శంకరయ్య, భాస్కర్, మాల్యాద్రి, కుమార్, సత్యం ధర్మారెడ్డి, లింగారెడ్డి, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.