Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ ఎఫెక్ట్...
- స్పందించిన హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కాలంలో విధులు నిర్వహించిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఐదు నెలల పెండింగ్ వేతనాలను సర్కారు చెల్లించింది. రాష్ట్రంలోని 18 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో పని చేసే 700 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించి నవతెలంగాణ దినపత్రిక సోమవారం 'ఐదు నెలలుగా వేతనాల్లేవ్' శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంత్రికి ధన్యవాదాలు
పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయించినందుకు మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీఎస్ఆర్ డీఏ) ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు టీఎస్ఆర్డీఏ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.