Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీఓలకు సీఐటీయూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలపాలని సీఐటీయూ కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని టీఎన్జీఓ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్‌లను సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, జె.వెంకటేశ్‌లు కలిశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలనీ, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనీ, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలనీ, అధిక ధరలను నియంత్రించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర డిమాండ్లపై జరగబోయే సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అఖిల భారత సంఘం కూడా పాల్గొంటున్నదని సీఐటీయూ నేతలు తెలిపారు. సమ్మె గురించి అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీఎన్జీవో నేతలు తెలిపారు.