Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
- మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులకు పరామర్శ
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
- మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులకు పరామర్శ
- కశ్మీర్‌ఫైల్స్ సినిమాలో వాస్తవాలు చూపలేదు
- తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రచారం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సంప్రదాయాల పేరుతో మహిళలను ఇంటికే పరిమితి చేసిన కాలంలోనూ ప్రపంచ స్థాయి గెరిల్లా పోరాటాలను మల్లు స్వరాజ్యం ముందుండి నడిపారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులను బృందా పరామర్శించారు. అనంతరం దొడ్డి కొమురయ్య భవనం(సీపీఐ(ఎం)) కార్యాలయంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సాయుధ పోరాట వీరనారి పేద ప్రజల కోసం చివరి వరకు తలపించిన మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమన్నారు. ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. 12ఏండ్లకే గ్రామాల్లో పేదలు పడుతున్న భాధలు చూడలేక.. అప్పుడున్న పరిస్థితులను చూసి తట్టుకోలేక ఉద్యమంలోకి అడుగులు వేసిందన్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలకు ఆమె స్ఫూర్తి అని కొనియాడారు. నైజాంకు ఎదురొడ్డి.. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి మహిళల పోరాట పటిమను ప్రపంచానికి చాటిన వీరనారి అని గుర్తుచేశారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అడవుల్లో చెట్ల నడుమ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బంధూకు చేతపట్టి పోరాటం చేశారని అన్నారు.
కశ్మీర్‌ఫైల్స్ సినిమాలో వాస్తవాలు చూపలేదు: బృందాకరత్
కశ్మీర్ ఫైల్స్ సినిమాలో వాస్తవాలు పూర్తిస్థాయిలో చూపలేదని బృందాకరత్ అన్నారు. కశ్మీర్ పండిట్లు తీవ్రమైన అణచివేతకు గురయ్యారనడంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. దేశంలో ఎవరూ ఎదుర్కొనని హింసను వారు ఎదుర్కొన్నారన్నారు. కానీ, ఉగ్రవాదుల చేతిలో హింసకు గురైంది కశ్మీర్ పండిట్లే కాదని, మొత్తం కాశ్మీరులు గురయ్యారని అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి కుటుంబంలో కూడా ఇద్దరిని ఉగ్రవాదులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఎంతో మంది ముస్లిం నాయకులనూ బలితీసుకున్నారన్నారు.
అవన్నింటినీ మరుగున పడేసి ఒక వర్గానికి మాత్రమే నష్టం జరిగినట్టుగా ప్రచారం తగదన్నారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వాలు ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఐద్వా జాతీయ నాయకులు జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, స్వరాజ్యం కుమారులు మల్లు గౌతమ్‌రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.