Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు తదితరుల వేతనాలను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించి, హామీనిచ్చిన నేపథ్యంలో డీఎమ్ఈ రమేశ్‌రెడ్డికి యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ధన్యవాదాలు తెలిపింది. వేతనాల పెంపుదల కోసం డీఎమ్ఈ ప్రత్యేకంగా కృషి చేశారని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్, ప్రధాన కార్యదర్శి కె.యాదా నాయక్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను ప్రత్యే కంగా కలిసి సన్మానించినట్టు తెలిపారు. వేతనాల పెంపుదల అంశంపై గత రెండేండ్లుగా తమ యూనియన్ పోరాటాలు నిర్వహించిందని వారు గుర్తు చేశారు.