Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను అధిగమించి దేశంలోనే అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలంటూ ప్రవాస భారతీయులను ఆయన కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి... బుధవారం మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టర్స్ రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ప్రపం చవ్యాప్తంగా ఎన్నో అద్భుత అవకాశాలకు ఆస్కారమేర్పడిందని వివరిం చారు. అన్ని రంగాల్లో సమానమైన వృద్ధిని చూడాలంటే తెలంగాణకు రావాలన్నారు.