Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుకుప్పల దళితులను పాలకుర్తి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టాలు ఇవ్వాలంటూ నిరాహారదీక్ష చేస్తున్న ఏడు మంది దళితులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.