Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి
- 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
- ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. వచ్చేనెల నాలుగో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడతామన్నారు. బుధవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ మంజూరు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని విమర్శించారు.అందుకోసం నిధులు కేటా యించలేదని చెప్పారు.మాటలతో సరిపెట్టకుండా ఆచరణలో అమలు చేయాల ని కోరారు.కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 28,29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించారు.కాశ్మీర్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రజల మీద దాడి చేస్తున్నదని విమర్శించారు.రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా ఆ సినిమాను చూడాలని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమ ని అన్నారు.మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే దొకటి,చేసేదొకటిలా ఉందన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామం టూ హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చారని చెప్పారు.గత ప్రభుత్వా లు ఇచ్చిన హక్కుపత్రాలు చెల్లవంటూ పోడు భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని అన్నారు. పోలీసులు, అటవీ అధికారుల దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు.ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య మాట్లాడుతూ కార్మికులు,రైతులు కలిసి ఈనెల 28,29 తేదీల్లో చేస్తున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తున్నామని చెప్పారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయల చంద్రశేఖర్ మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మలపై చినజీ యర్స్వామి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఎవరి విశ్వాసాలు వారికుంటాయనీ,వీరవనితలను అవమానించడం సరైంది కాదన్నా రు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ, రాష్ట్ర నాయకులు ఎం హన్మేష్, సూర్యం, ఎస్ఎల్ పద్మ పాల్గొన్నారు.