Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైకోర్టుకు కొత్తగా నియమితులైన పది మంది గురువారం న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో నిర్వహించే కార్యక్రమంలో పది మందితో చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ ప్రమాణం చేయిస్తారు. న్యాయాధికారులు ఐదుగురు, న్యాయవాదుల కోటా నుంచి మరో ఐదుగురు చొప్పున న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా వెలువరించింది. న్యాయాధికారిణిగా పని చేస్తున్న వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జి.అనుపమ చక్రవర్తి, కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జి ఎం.జి.ప్రియదర్శిని, హైదరాబాద్‌లో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సాంబశివ నాయుడు,న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ డి.నాగార్జున, న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్,జువ్వాడి శ్రీదేవి,నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్‌లు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.