Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూసెట్)తో విద్యా కేంద్రీకరణకు బాటలు పడతాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.సామాజిక న్యాయం అ మలు, గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.యూజీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.