Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదానం
- భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 91 వర్ధంతి
నవతెలంగాణ-ముషీరాబాద్
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్ మూర్తి, కోటా రమేశ్ అన్నారు. బుధవారం భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ 91వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన మహాయోధుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. 'మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం' అనే నినాదంతో బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అన్నారు. నేటి యువత దేశంలో విద్య కాషాయీకరణ, మహిళలపై లైంగికదాడులకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలపై పోరాడాలన్నారు. భగత్ సింగ్ ఆశయసాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, కార్యదర్శి జావిద్, నాయకులు నాగేందర్, శ్రీమన్, వేణు, నాగరాజు, అజరు, అనూష, సనా, వేమన, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలి : న్యూడెమోక్రసీ
ప్రజలపై మరింత భారాన్ని మోపే విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి పెంచి పేదలు, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపిందని విమర్శించారు
. వృధా ఖర్చును తగ్గించడం ద్వారా భారాలు పెంచకుండా విద్యుత్‌ను సరఫరా చేయొచ్చని సూచించారు. బంగారు తెలంగాణను నిర్మిస్తున్నామంటూ అనునిత్యం ఊదరగొట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.