Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే ఎంజీఎంకు
- టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల రైల్వే కన్సెషన్ పాస్‌లను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) ఆధ్వర్యంలో బుధవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. కోవిడ్ కారణంగా 2020లో జర్నలిస్టుల రైల్వే కన్సెషన్ పాస్‌లను నిలిపివేశారనీ, ఇప్పటి వరకు మళ్లీ వాటిని పునరుద్ధరించలేదని గుర్తు చేశారు. దీంతో జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి. బసవపున్నయ్య రైల్వే ఎంజీఎంకు వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వే బోర్డు దష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల కన్సెషన్ పాసుల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, కార్యవర్గ సభ్యులు పాండు రంగారావు, హెచ్‌యూజే కార్యదర్శి నిరంజన్, నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.