Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
- జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షల్లేకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయటం ద్వారా... దేశ అవసరాలకు
అనువుగా ఉండే జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలని కోరారు. కేంద్రం అనుసరిస్తున్న అస్థిర, అనిశ్చిత విధానాల వల్ల రైతులు విసుగు చెందుతున్నారు, వారిలో అసంతృప్తి రేకెత్తుతున్నదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన బుధవారం లేఖ రాశారు. రబీ సీజన్లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరిసాగవుతున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనకపోతే వరికి ఇచ్చే కనీస మద్దతు ధరకు అసలు అర్థమే ఉండబోదని తెలిపారు. మరోవైపు కేంద్రం చర్యల వల్ల జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని గుర్తు చేశారు. పత్తి, పామాయిల్ పంటలను సాగు చేయాలంటూ రైతులను కోరామని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో గత రెండేండ్లుగా వారిలో నిస్సహాయత, ఆగ్రహం పెల్లుబుకిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం -2013 మేరకు దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ, సరఫరా బాధ్యత కేంద్రానిదేనని కేసీఆర్ ఈ సందర్భంగా మోడీకి గుర్తు చేశారు.
'బోయిగూడ' ఘటనపై సీఎం దిగ్భ్రాంతి...
సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జర గటం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబీకులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషి యోను ప్రకటించారు. భౌతిక కాయాలను స్వస్థలాలకు తరలించేం దుకు ఏర్పాట్లు చేయాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు.