Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాన్యుడికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్విచ్ ముట్టుకుంటే కళ్లు తిరిగినట్టు కరెంటు మీటర్ తిరిగేలా చార్జీలను పెంచేసింది. ఉమ్మడి రాష్ట్రం మొదలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ప్రజలపై ఏకమొత్తంగా రూ. 5,596 కోట్ల భారాన్ని మోపింది. ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించి, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసిన తప్పిదాలకు రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన కరెంటు చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ప్రకటించింది. బుధవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కరెంటు చార్జీల పెంపు నిర్ణయాలను టీఎస్ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎమ్డీ మనోహరరాజు (టెక్నికల్), బీ కృష్ణయ్య (ఫైనాన్స్) ప్రకటించారు. కరెంటు చార్జీల పెంపుపై టీఎస్ఈఆర్సీ నిర్వహించిన నాలుగు బహిరంగ విచారణల్లో దాదాపు 266 మంది తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీరిలో ఏ ఒక్కరూ చార్జీల పెంపును కోరలేదు. అయినా చార్జీలను పెంచుతూ టీఎస్ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. డిస్కంలు 18 శాతం టారిఫ్ పెంపును కోరగా, టీఎస్ఈఆర్సీ 14 శాతం మేరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. డిస్కంలు ప్రతిపాదించిన పరిశ్రమల టారిఫ్ ప్రతిపాదనలను మాత్రం కమిషన్ తిరస్కరించింది. తగ్గించామని చెప్తున్న ఆ నాలుగు శాతం దీనిలోనిదే కావడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు డిమాండ్ చార్జీలు లేవు. కొత్తగా వారికి ఈ పేరుతో అదనంగా రూ.10 భారాన్ని మోపారు. వాడుకున్న కరెంటు యూనిట్లకు అదనంగా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇంట్రెస్ట్, అడిషనల్ చార్జీలతో పాటు ఇప్పుడు ఎల్టీ-1(ఏ) కేటగిరి నుంచి ఎల్టీ-1బీ(2) కేటగిరి వరకు డిమాండ్/ఫిక్స్డ్ చార్జీలను విధించారు. గృహ వినియోగదారుల డిమాండ్ చార్జీల ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు తప్ప, డిస్కంల టారిఫ్ ప్రతిపాదనలన్నింటినీ ఈఆర్సీ ఆమోదించింది. రాష్ట్రంలో చివరిసారిగా 2016-17లో కరెంటు చార్జీలు పెరిగాయి. ఆ తర్వాతి నుంచి డిస్కంలు ఆదాయ అవసరాల ప్రతిపాదనలను (ఏఆర్ఆర్) టీఎస్ఈఆర్సీకి ఇవ్వనేలేదు. తాజాగా 2022-23 ప్రతిపాదనలను డిస్కంలు ఇచ్చాయి. పాత సంవత్సరాల ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ఈఆర్సీ ప్రకటించింది. అయితే ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తే కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదనే వాదనను ఈఆర్సీ పరిగణనలోకి తీసుకోలేదు. కాస్త వెనుకాముందుగా ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లిస్తుందనీ, డిస్కంలు అలాగే తమకు నివేదించాయని ఈఆర్సీ చైర్మెన్ శ్రీరంగారావు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగినందునే టారిఫ్ పెంచాల్సి వచ్చిందని వివరించారు. డొమెస్టిక్ వినియోగదారులకు డిమాండ్ చార్జీలతో పాటు యూనిట్‌కు 50 పైసలు భారం వేయగా, షాపులు, కమర్షియల్ కేటగిరి వినియోగదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున పెంచారు.