Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
అష్టాదశ పీఠాల్లో ఒకటైన మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని అంబాబాయి మహాలక్ష్మి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ దంపతులు గురువారం దర్శించారు. ఇందుకోసం సీఎం... హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ దంపతులకు అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం సతీసమేతంగా అంబాబాయి మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోష్‌కుమార్, నమస్తే తెలంగాణ ఎమ్డీ దీవకొండ దామోదరరావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ డీవై పాటిల్‌ను, ఆయన మనవడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రుతురాజ్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు ఈ సందర్భంగా చర్చించారు. తన పర్యటన ముగించుకుని సీఎం సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.