Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ గురువారం ఒక ప్రకటనలో రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక నిరు పేద ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ కంపెనీల సంస్థలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే నేషనల్ మానిటైజేషన్ పైపులైనును ఉపసంహరించాలని కోరారు. అధిక ధరలను నియంత్రించాలనీ, నూతన విద్యా విధానా న్ని రద్దు చేయాలనీ ,పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయాలని కోరారు. ఆ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెంచిన విద్యుత్ చార్జీలను ఉప సంహరించాలి
పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకో వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గహ వినియోగదారులపె,ౖ ప్రజలపై విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.5,596 కోట్ల భారాన్ని మోపటానికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఎంత పెరిగింది అనేదాన్ని ప్రామాణిక ంగా తీసుకుని విచక్షణతో నిర్ణయాలు చేయటం అవసరమని పేర్కొన్నారు.రూ.8,221 కోట్లు సబ్సిడీగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొరకు ,101 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇస్తుందని తెలిపారు.. మరోవైపు అంతర్గత సామర్ధ్యాన్ని పెంచుకోవటం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకోగలుగుతామని డిస్కంలు తెలిపాయని గుర్తుచేశారు.