Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్మెన్ ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోఆమె విలేకర్లతో మాట్లాడారు. కరోనా కష్ట కాలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు, పరిశ్రమలపై విద్యుత్ చార్జీలు పెంచి కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచి మోయలేని భారాన్ని వేసిందని ఆరోపించారు. డిస్కాంలు పెట్టిన పెంపుదల ప్రతిపాదనలను ఉన్నదున్నట్టు రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించడమంటే ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించలేదని అర్థమవుతున్నదన్నారు. గృహాలకు యూనిట్‌కు రూ.1.45 పైసలు కాగా, ప్రస్తుతం యూనిట్‌కు 50 పైసలు పెంచి రూ.1.95 పైసలు చేయడం వల్ల 34 శాతం పెంచారని ఆమె ఆరోపించారు. దాదాపు 60 లక్షల మంది వినియోగదారులపై ప్రభుత్వం మోయలేని భారం మోపిందన్నారు. టారీఫ్ రేట్ల బహిరంగ విచారణలో పాల్గొన్న అనేక మంది ఛార్జీలు పెంచొద్దని, భారాలను ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని శాస్త్రీయంగా వివరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.