Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-నల్లగొండ
మహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి పరిష్కారానికి పోరాడతామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవన్లో ఐద్వా నల్లగొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదలను వంచించిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం అన్యాయమన్నారు. బడ్జెట్లో మహిళలకు సరిపడా నిధులు కేటాయించలేదని, సంక్షేమం గాలికొదిలారని అన్నారు. ఐద్వా పోరాట ఫలితంగానే అభయహస్తం డబ్బులను తిరిగి మహిళలకు ప్రభు త్వం ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ దాడులు, దౌర్జన్యాలు, అఘా యిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా ఉద్యమాలకు దిక్సూచి మల్లు స్వరాజ్యం...
దోపిడీ దౌర్జన్యాలకు, నిజాం వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తుపాకీబట్టి పోరాడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం అని, మహిళా సమస్యలపై ఎదిరించి నిలబడిన పోరాట యోధురాలు అని అన్నారు.
సమా వేశం అనంతరం జరిగిన సంతాప సభ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్య దర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధ, జిట్టా సరోజా, నిమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల పద్మ, సీనియర్ నాయకులు పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.