Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టుకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. వారితో చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయవాదుల కోటా నుంచి వరుసగా కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, నట్చరాజు శ్రావణ్‌కుమార్ వెంకట్, న్యాయాధికారుల కోటా నుంచి గున్ను అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున ప్రమాణం చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్, సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణ చేపట్టారు.