Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొమెడ్ కే యూజీఈటీ, యునిగేజ్ ప్రవేశ పరీక్షలు జూన్ 19న జరుగనున్నాయి. దాదాపు 190 ఇంజినీరింగ్ కళాశాలలు, 50కిపైగా ప్రయివేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నట్టు కొమెడ్ కే ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలు కర్నాటక ప్రొఫెషనల్ కాలేజీల ఫౌండేషన్ ట్రస్ట్, యునిగేజ్ సభ్య యూనివర్శిటీలలో బీఈ/బీటెక్ ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 150 నగరాలలో నాలుగు వందలకు పైగా పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని వివరించారు. ఈ ఏడాది ఈ పరీక్షల కోసం 80 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. మే రెండో తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామని పేర్కొన్నారు.