Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఐటీ ఏపీ విద్యార్థి సుధాన్షు దొడ్డి రూ.63 లక్షల ప్యాకేజీతో అంతర్జాతీయ ఉద్యోగం సంపాదించారు. అమెరికాకు చెందిన ప్రముఖ అనలిటిక్స్ కంపెనీలో బీటెక్ సీఎస్ఈ చదువుతున్న విద్యార్థి ఉద్యోగం సాధించారని వీఐటీ వైస్ చాన్సలర్ ఎస్వి కోటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ విద్యా విధానాలు, విద్యార్థుల అకుంఠిత దీక్ష వల్లే ఇలాంటి అనితర సాధ్యమైన విజయాలను సాధిస్తున్నామని వివరించారు. ప్రపంచానికి బాధ్యతగల రేపటితరం నాయకులను అందించడానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 24 నాటికి 627 మంది విద్యార్థులకు 1,175 ఉద్యోగావకాశాలు లభించాయని వివరించారు. ఇందులో 246 సూపర్ డ్రీం ఆఫర్లు కాగా, 354 డ్రీం ఆఫర్లున్నాయని తెలిపారు. ఈ ఏడాది సరాసరి పారితోషికం గతేడాదితో పోలిస్తే రూ.6.77 లక్షల నుంచి రూ.7.3 లక్షలకు పెరిగిందని వివరించారు. ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో దాదాపు 805 బహుళజాతి సంస్థలు పాల్గొన్నాయని కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ వి శామ్యూల్ రాజ్‌కుమార్ తెలిపారు.