Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఎస్సీ కమిషన్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దళితులు, ఆదివాసీల భూములతోపాటు భూదాన్ భూముల కబ్జా కోసమే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఆయన జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, అయన సహచరులు, నాయకులు దళిత, ఆదివాసీల భూదాన్ భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలం, మేకలగుట్ట గ్రామంలో అక్రమంగా 110 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి రికార్డులను ఎమ్మెల్మే తాటికొండ రాజయ్య, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అండదండలతో తగులబెట్టించారని తెలిపారు. అనంతరం అక్రమంగా టీఆర్ఎస్ నాయకులు తమ పేర్లను ధరణిపోర్టల్‌లో ఎక్కించుకున్నారని పేర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అని పేర్కొన్నారు. ఆ భూములను కొనేందుకు, అమ్మేందుకు వీలులేదనీ, అయినా పోర్టల్‌ను ఉపయోగించి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.