Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్స్యవృత్తిలోకి బహుళజాతి కంపెనీలను అనుమతించటం ద్వారా సంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మిడ్‌మానేరు డ్యామ్‌కు సంబంధించి రూ.1000కోట్లతో 'ఫిష్ఇన్' అనే బహుళజాతి చేపల ఎగుమతి కంపెనీతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ ఒప్పందంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన మొదలైందని పేర్కొన్నారు. తక్షణమే బహుళజాతి కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని కోరారు. మత్స్యకారులను వృత్తికి, ఉపాధికి దూరం చేసే చర్యలను మానుకోవాలని కోరారు.