Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖలోని 12,735 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయించడం పట్ల తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్థన్ నేతృత్వంలో నాయకులు మంత్రి హరీశ్ రావుతో పాటు తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణను కలిసి ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చే క్రమంలో అమలవుతున్న పథకాలను వివరించేలా త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా డాక్టర్ జనార్థన్ తెలిపారు.