Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చైర్పర్సన్ సునీతా రావు నేతృత్వంలో నాయకులు ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అనంతరం వారిని నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ ప్రజలపై విపరీతంగా భారాలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని విమర్శించారు. పేదలపై భారం తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు.