Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే :శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరిత విధానాన్ని మార్చుకుని, పంజాబ్ మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండోసారి శాసనమండలి చైర్మెన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలని హితవు పలికారు. పంజాబ్‌కి ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా.. అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి రైతుల బాధలు ఎలా తెలుస్తాయని ఆరోపించారు.