Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్ బాలభవన్ సంచాలకులు ఉషారాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉగాది పండుగను పురస్కరించుకుని ఈనెల 28న బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జవహర్ బాలభవన్ సంచాలకులు జి ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి నృత్యం, భరతనాట్యం, జానపద నృత్యం, పెయింటింగ్, సైన్స్, యోగా, ఎలిక్యుటేషన్, వ్యాసరచన, సంగీతం వంటి పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో ఆరు నుంచి ఎనిమిదేండ్ల సబ్జూనియర్ల విభాగం, 12 నుంచి 16 ఏండ్ల వరకు సీనియర్ల విభాగం విద్యార్థులకు పోటీలుంటాయని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పాఠశాలలు కాకుండా వ్యక్తిగత విద్యార్థిని, విద్యార్థులూ పాల్గొనొచ్చని సూచించారు. నేటి తరానికి ఉగాది పండుగ విశిష్టత, ప్రాముఖ్యతను తెలుసుకోవడం అవసరమని తెలిపారు. పిల్లలు చదువులకే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పొందడంతోపాటు చదువు మీద ఏకాగ్రత పెంపొందుతుందని వివరించారు. జంటనగరాల్లోని విద్యార్థులు బాలభవన్ నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక పోటీల్లో పాల్గొనాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు విజేతలకు మొదటి, రెండు, మూడు, కాన్సులేషన్ బహుమతులతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7095035959, 9848747432 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.