Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా కేంద్రం అబద్ధాలు
- మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అలాంటిదేమి లేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. కేంద్రం గొబెల్స్ ప్రచారానికి దిగింది. గతంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని చెప్పిందని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు రాలేదని పార్లమెంటులో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ చెప్పడం పట్ల హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అబద్ధాలాడుతూ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని స్పష్టం చేశారు.