Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉండి ఆ రకంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డం సరైంది కాదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పండిన వరిధాన్యం ప్రతి గింజానూ కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆ వైపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ధాన్యం కొనలేమంటూ మాట్లాడ్డం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.