Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా
హైదరాబాద్ : విమానయాన సంస్థలు దేశంలో ప్రతీ ఏడాది కొత్తగా 110-120 విమానాలను తీసుకురానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధఙయా అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన వింగ్స్ ఇండియా 2022లో ప్రారంభ సెషన్లో ఉపన్యాసం చేశారు. హెలిక్యాప్టర్లు మరింత పెద్ద పరిమాణంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రతీ ఏడాది విమానయాన ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది ఇది 4.10 లక్షలుగా ఉండొచ్చన్నారు. దేశంలో కొత్త ఎయిర్పోర్టులు, విమానాల విస్తరణకు విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. 2013-14 నాటికి దేశంలో 400 ఎయిర్క్రాప్ట్లు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం వీటి సంఖ్య 710కి చేరిందన్నారు. ఇకపై ప్రతీ ఏడాది కొత్తగా 110-120 కొత్త విమానాలు వచ్చి చేరనున్నాయని మంత్రి అంచనా వేశారు.
భారత్లో ఇంధన ధరలే సవాల్ : బోయింగ్
భారత్లో విమానయాన రంగానికి ఇంధన ధరలు, కరెన్సీ, స్వల్ప చార్జీలే ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని బోయింగ్ కమర్షియల్ ఎరోప్లేన్స్ రీజినల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డావె చులె అన్నారు. వింగ్స్ ఇండియా -2022లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్య ఈశాన్య, ఆఫ్రికా, ఆసియన్, నార్త్ అమెరికా దేశాలతో పోల్చితే భారత్లో విమానయాన ఇంధన ధరలు 90 శాతం అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత వాణిజ్య విమానయాన రంగంలో విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. అధిక ఇంధన ధరలు కలిగిన భారత్లో తమ నూతన ఎయిర్క్రాప్ట్లు బోయింగ్ 737 మాక్స్, 737-10లతో వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
ఫ్లైబిగ్కు 10 విమానాలు
కొత్తగా విమానయాన సేవలు ప్రారంభించిన ఫ్లైబిగ్ 10 విమానాలు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.. ఇందుకు 'వింగ్స్ ఇండియా'లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.. కెనడాకు చెందిన డీ హావిలాండ్ 'ట్విన్ ఓటర్ సీరిస్ 400' విమానాలను సొంతం చేసుకునేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామని ప్లైబిగ్ సీఎండీ సంజరు మాండవియా తెలిపారు. చౌక ధరల్లో మధ్యతరగతికి కూడా విమానయానం అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ఉడాన్ పథకంలో వీటిని ఉపయోగించనున్నామన్నారు.