Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమస్యలపై సర్వే
నవతెలంగాణ -నల్లగొండ
మహిళల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారనీ, ఈ సర్వేలో గుర్తించిన మహిళా సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాలు చేపడ్తామని ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చింతబావిగూడెం కాలనీలో మహిళా సమస్యలపై ఐద్వా, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎన్నికల ముందు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి పూర్తిస్థాయిలో పంపిణీచేయలేదన్నారు. పింఛన్లు సరిగ్గా రావడం లేదని, రేషన్ కార్డులు లేవని, అంగన్వాడీ కేంద్రం లేదని సర్వేలో గుర్తించామన్నారు. అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. సీసీరోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వేలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని.. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. పరిష్కరించని ఎడల
పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. అభయ హస్తం కట్టిన మహిళలకు పెన్షన్లు ఇవ్వాలని కోరారు. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సరోజ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు పట్టణకేంద్రాల్లోనూ కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, కాలనీ వాసులు లావణ్య, సంతోష, రాధిక, లింగమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.