Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త కార్మిక సమ్మె
- గ్రామీణబంద్లో పాల్గొందాం
- దేశాన్ని కాపాడుకుందాం
- సామాజిక శక్తులు సమ్మెలో మమేకమవుదాం: కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 28,29న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్)రాష్ట్ర కమిటి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెసీ, ్ల టి స్కైలాబ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ సర్కారు కష్ట జీవుల నోళ్లు కొట్టి కార్పొరేట్లకు లాభాలు సమకూర్చే విధానాలను అనుసరిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. దీంతో దళిత గిరిజన బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. దేశ భక్తి ముసుగుతో ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నదని తెలిపారు. 29 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. కనీస వేతనాలు అమలు కావటం లేదనీ, పని భారం పెంచుతున్నదని తెలిపారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని పేర్కొన్నారు. పీడిత ప్రజల సంక్షేమం కోసం దేశ భవిష్యత్ కోసం జరుగనున్న సార్వత్రిక సమ్మెను సామాజిక తరగతులు బలపర్చాలని కోరారు.