Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతీ మాసంలో నాలుగో గురువారం డిజిటల్ లిటరిసీకి ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) తెలిపింది. ఆర్బిఐ సూచనల మేరకు 2016 నుంచి ఫైనాన్సీయల్ లిటరిసీ వీక్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే 'గో డిజిటల్ - గో సెక్యూర్' నినాధంతో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నట్లు పిఎన్‌బి ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో 38 శాతం కుటుంబాలు మాత్రమే డిజిటల్ అక్షరాస్యత అవగాహన కలిగి ఉన్నాయి. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 61 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం చొప్పున మాత్రమే దీనిపై అవగాహన కలిగి ఉన్నాయని అంచనా.