Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల్లోకి తీసుకోవాలి : శివసేనారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తొలగించిన సాక్షరభారత్ కో ఆర్డినేటర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 18,306 మంది కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారని చెప్పారు. నిరాక్ష రాస్యులను అక్షరాస్యులుగా తయారు చేసే కోఆర్డినేటర్లక ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతూ శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్ నుంచి విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించేందు కు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. వారిని అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కార్యదర్శి కష్ణంరాజు, సాక్షర భారత్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్, నాయకులు రాము గౌడ్, రవి కుమార్ యాదవ్, భీమయ్య, దేవరాజు, నెహ్రూ,సుధీర్ గౌడ్, గ్రామ కోఆర్డినేటర్స్ మాధవి, రుక్మిణి పాల్గొన్నారు.