Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడల్‌గా ఎంపిక చేసిన హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆలియా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి పనులను శనివారం మంత్రి పరిశీలించారు. నూతన హంగులు సంతరించుకుంటున్న ఆలియా పాఠశాలలో అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. రూ.7,289 కోట్లతో మూడు దశల్లో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడాతోపాటు నగరంలోని ఆలియా, మహబూబియా (బాలికల) పాఠశాలలను ఎంపిక చేశామని వివరించారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలతో పాటుగా ఇతర మరమ్మతులు, పెయింటింగ్ లాంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
వంద గ్రంథాలయాల్లో పోటీపరీక్షల మెటీరియల్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో 80,039 ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలోని వంద గ్రంథాలయాల్లో పోటీపరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు విద్యాశాఖ మంత్రి ప సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్‌తోపాటు ఆశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.