Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌ను కలిసిన కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సోమ, మంగళవారాల్లో కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించబోయే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు రేవంత్‌ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సమ్మెకు మద్దతు కోరుతూ ఆయనకు లేఖను అందజేశారు. రేవంత్‌ను కలిసిన వారిలో ఆర్డి చంద్రశేఖర్ (ఐఎన్టీయూసీ), విఎన్ బోస్ (ఏఐటీయూసీ), పాలడుగు భాస్కర్,జె వెంకటేష్(సీఐటీయూ),రెబ్బా రామారావు (హెచ్ఎంఎస్), జిరాంబాబు యాదవ్ (టీఆర్ఎస్కేవీ),కె సూర్యం (ఐఎఫ్టీయూ),ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), ఎంకే బోస్ (టీఎన్టీయూసీ), బాబూరావు (ఏఐయూటీయూసీ) ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కనీస వేతనం రూ 26వేలు నిర్ణయించాలని కోరారు. అధిక ధరలతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ముఖ్యంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈనేపథ్యంలో జరిగే దేశ భక్తియుక్త సమ్మెకు ప్రజలకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.