Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ నెల 27న జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించరాదని హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుండగా ఆ ఖర్చులకు ఆమోదం చెప్పడానికే జనరల్ బాడీ సమావేశం నిర్వహించబోతున్నారని జోజప్ప అనే వ్యక్తి రిట్ దాఖలు చేశారు. జనరల్‌బాడీ నిర్వహించరాదని జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.