Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ కార్యదర్శికి గిరిజన సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సాగు చేస్తున్న అటవీ భూములకు పట్టాలివ్వాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తుకు శనివారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శిలు ఎం.ధర్మ నాయక్, ఆర్. శ్రీ రామ్ నాయక్ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఆంజయ్యనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములు సాగుచేస్తున్న గిరిజనుల నుంచి దరఖాస్తులు నవంబరు ఎనిమిది నుండి డిసెంబర్ ఎనిమిది వరకు స్వీకరించారని గుర్తుచేశారు. నాలుగు నెల్లయినా స్వీకరించిన వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నా రని తెలిపారు. జిల్లా కలెక్టర్లు తక్షణమే స్పందించి అర్హులైన వారందరికీ అటవీ హక్కుల చట్టం క్రింద హక్కు పత్రాలు ఇవ్వాలని వారు కోరారు.