Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్
- మూడు జిల్లాల్లో 6 గూడేలు దత్తత
- అప్పాపూర్, భౌరాపూర్ పెంటలకు ద్విచక్ర అంబులెన్సులు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
నల్లమల అటవీ ప్రాంతంలో జీవనం సాగించే ఆదివాసిల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌంద రాజన్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాపూర్ చెంచు గూడేన్ని గవర్నర్ శనివారం సందర్శించి మాట్లాడారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలను కలుసుకోవడం నా జీవితంలో మరచిపోని జ్ఞాపకమన్నారు. రాష్ట్రంలో ఆడవివాసీలు అధికంగా ఉన్నారని అందు లో నాగర్క ర్నూల్, అదిలా బాద్, భద్రా ద్రి కొత్తగూడేల్లోని 6 చెంచు పెంటలను దత్తతకు తీసు కున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ఈ జిల్లాలో అప్పాపూర్, భౌరాపూర్ పెంటలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. వారికి సేవ చేయడం అదృష్టంగా బావిస్తున్నట్టు తెలిపారు. చెంచులు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన ా్నరు. ఆదివాసుల ఆర్థికాభివృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. చెంచులకు మెరుగైన ఆరోగ్యం కోసం అప్పాపూర్, భౌరాపూర్ చెంచుగూడేలకు రెండు ద్విచక్ర వాహన అంబులెన్సులు కేటాయించారు. భవిష్యత్లో చెంచు పెంటలను మరింత అభివృద్ధి చేస్తామ న్నారు. అంతకుముందు గవర్నర్కు చెంచులు తమ సాంప్రదాయ వేషాధారణలో డప్పులు, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. చెంచుల ఇండ్లను పరిశీలించిన ఆమె అక్కడున్న దేవాలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఐటీడీఏ, ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఆశ్రమ పాఠశాలలోని చిన్నారులతో ముచ్చటించి స్కానింగ్ సెంటర్లో మహిళకు స్కానింగ్ చేసి పరీక్షించారు. గవర్నర్ రాక సందర్భంగా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిరాజ కోళ్లను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర భవన్, జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్, జెడ్పీ చైర్పర్సన్ పి.పద్మావతి, జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా ఎస్పీ కె.మనోహర్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ఐటీడీఏ పీఓ అశోక్, ఎఫ్డీఓ రోహిత్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్, ఎంపీపీ గీతాంజలి, సార్లపల్లి సర్పంచ్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.