Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతు సంఘం మహిళా రైతుల 'రాష్ట్ర సదస్సు'లో రాష్ట్ర కన్వీనర్‌గా కందాల ప్రమీల ఎన్నికయ్యారు. కో-కన్వీనర్లుగా బానోతు కుమారి (భద్రాద్రి కొత్తగూడెం), శీలం పకీరమ్మ (ఖమ్మం), పూసల నాగలక్ష్మి (నిజామాబాద్), బొబ్బ లక్ష్మి (మహబూబాబాద్), కమిటీ సభ్యులుగా ధారవత్ బుజ్జి, దేవిరెడ్డి శైలజ, గంగాదేవి, బొంతు సమత, నీరడి గంగామణి, సమ్మక్క, శ్రీదేవి, కంచర్ల ఉర్మిళ, నంద్యాల మహేశ్వరి తదితరులు ఎన్నికైనట్టు తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళ రైతులకు ప్రత్యేక ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయాలనీ, భూమి హక్కు పత్రాలు మహిళల పేరుతో ఇవ్వాలని సదస్సు తీర్మానించింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, మహిళలకు యంత్రాలతో పని చేయించడంలో నైపుణ్యం కల్పించాలని డిమాండ్ చేసింది. సహకార సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఆ సంఘాల ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేసింది.