Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ ఖమ్మం రీజియన్ కుటుంబం నుంచి రూ. 57 వేలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దోనేపల్లి వెంకన్న కుటుంబానికి నవతెలంగాణ ఉమ్మడి జిల్లాల విలేకరులు, సిబ్బంది కలిసి రూ.57వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని శనివారం నవతెలంగాణ ఖమ్మం ఉమ్మడి జిల్లా రీజియన్ మేనేజర్ జావెద్ దోనేపల్లి కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా సీపీఐ(ఎం) తిరుమలాయ పాలెం మండల కమిటీ రూ.20వేలు, కామేపల్లి మండల కార్యదర్శి దుగ్గి కృష్ణ రూ.5వేలు, వెంకన్న ప్రజాశక్తి సహచరుడు జయచంద్రారెడ్డి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. వెంకన్న సహచర విలేకరి గరిడేపల్లి వెంకటేశ్వర్లు క్వింటా బియ్యం అందించారు. అంతకుముందు తిరుమ లాయపాలెం మండలం జూపెడ గ్రామంలో వెంకన్న స్మారక స్థూపాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ఆవిష్కరించా రు.మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో పోతినేని మాట్లాడారు. జర్నలిస్టుగా ఎంతో అంకితభావంతో వెంకన్న పనిచేశారని నవతెలంగాణ రీజినల్ మేనేజర్ ఎస్డీ జావీద్, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో నవతెలంగాణ సిబ్బంది ఇరుగు వెంకటేశ్వర్లు, తేనె వెంకటేశ్వర్లు, గుమ్మడి నర్సయ్య, నాగుల్‌మీరా, మోహన్‌రావు, కణతాల వెంకటేశ్వర్లు, డేగల వెంకటేశ్వర్లు, సోమయ్య, బంగారపు రామకృష్ణ పాల్గొన్నారు. వెంకన్న మృతికి నవతెలంగాణ సంపాదకులు సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సంతాపం తెలిపారు. వెంకన్న చేసిన సేవలను ఒక ప్రకటనలో కొనియాడా రు. టీడబ్య్లూజెఎఫ్, మిగతా జర్నలిస్టు యూనియన్లు సంతాపం తెలిపాయి.