Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీ, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు కలిసి తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) -2020ని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు మద్దతుగా ఆదివారం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు.