Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపాలని రైతుల నిరసన
నవతెలంగాణ-చివ్వెంల
తమ పొలాలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నీటితో ఐలకుంటచెరువును నింపి సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ మోకాళ్ళపై కూర్చుని రైతులు నిరసన తెలిపిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. గ్రామంలోని ఐలకుంటచెరువు పరిధిలో 170 ఎకరాల్లో వరిని సాగు చేశామన్నారు. చెరువులో నీళ్లు లేక 20 ఎకరాల్లో వరి ఎండిపోతుందని వాపోయారు. బాలెంల శివారులోని రైతులు పేర్ల సోమలింగం, సౌడయ్య ఎస్సారెస్పీ కాల్వను ఆక్రమించుకుని తూములు మూసివేసి పొలం సాగు చేసుకున్నారన్నారు.ఎస్ఆర్ఎస్పీ కాలువను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని తిరిగి కాల్వను పునరుద్ధరించాలని ఏడాదికాలంగా పలు దఫాలుగా అధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చెరువు ఎండిపోవడం వల్ల పశువులకు తాగేందుకు నీరు దొరకడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ కాలువలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని చెరువును నీటితో నిప్పి పంట పొలాలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు సామబాల్రెడ్డి, గన్న జానకిరాములు,అరిగె భిక్షం, నర్సయ్య, మోహన్‌రెడ్డి, ఉపేందర్, అశోక్, సైదులు, మహేష్, రాములు, వెంకన్న పాల్గొన్నారు.