Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలు ధరలు పెంచిన బీజేపీ
- విద్యుత్ భారాలు మోపిన టీఆర్ఎస్
- 31 నుంచి నిరసనలు
- వచ్చే నెల 7న విద్యుత్ సౌధ, పౌరసరఫరాల కమిషనరేట్ వద్ద నిరసనలు : పీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేద, మధ్యతరగతి ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. పెట్రోలు ధరలు పెంచి బీజేపీ జనంపై తీవ్ర భారాలు మోపగా, విద్యుత్‌చార్జీలతో టీఆర్ఎస్ ప్రజలకు షాకిచ్చిందని చెప్పారు. ఆ రెండు పార్టీలు తమ దోపిడీని కప్పిపు చ్చుకునేందుకు, సమస్యలను
పక్కదారి పట్టించేందుకు సమన్వయంతో ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ప్రత్యేక ఆందోళనలు చేయనున్నుట్టు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలు వేంనరేందర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి, బెల్లయ్యనాయక్, మల్లు రవితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరితప్పును మరొకరు కప్పిపుచ్చుకునేందుకు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు. కరోనాతో ఉపాధి కరువై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ధరాభారం మోయలేని విధంగా ఉందని చెప్పారు. విద్యుత్ చార్జీలతో ప్రజలపై రూ 5596 కోట్ల భారం పడిందన్నారు. ఇతర పన్నుల పేరిట ప్రభుత్వం మరో రూ 6వేల కోట్ల అదనపు విద్యుత్ చార్జీలు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కాంల ఆర్థిక సంక్షోభానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని చెప్పారు. ఆ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో ఓటర్లకు తాయిలాలు ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలు రూ 12500 కోట్ల అప్పులపాలయ్యాయని చెప్పారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పేదలపై ఒక పైసా భారం పడదని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ఆందోళనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యాచరణ
- మార్చి 31న సిలిండర్లకు దండలేసి ఇండ్ల ముందు నిరసనలు
- కరెంట్ ఏఈ, డీఈ కార్యాలయాల వద్ద ధర్నాలు
- ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాల ముందు మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలి.
- ఏప్రిల్ 5న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి
- ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ, పౌరసరఫరాల కమిషనరేట్ వద్ద ధర్నాలు